ఇది విలక్షణమైన తీర్పు : రేవంత్ రెడ్డి

 

రథసారధి ,హైదరాబాద్:

తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాదులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున శ్రీకాంతాచారి అమరుడయ్యారని ,తిరిగి ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ గెలవడం శ్రీకాంతాచారి కి ఘన నివాళిగా ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రగతి భవన్ పేరును డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామన్నారు. సామాన్యుడి కోసం సచివాలయం గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. ఇకపై గత పరి పాలన లాగా తెలంగాణలో పాలన ఉండబో దని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.