మహిమూద్ మృతి తీరని లోటు: జూలకంటి

రథ సారథి, మిర్యాలగూడ:

సిపిఎం సీనియర్ నాయకుడు ఎండి మహమూద్ మృతి పార్టీకి , పేద ప్రజలకు తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మహమూద్ మృతదేహాన్ని నల్గొండ సూర్యాపేట సిపిఎం జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి తో కలిసి సందర్శించారు. పార్టీ జెండాను కప్పి నివాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహి మూద్ విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే వారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆనాడే అనేక పోరాటాలు చేశారన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరి పేద ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్మించారన్నారు. కౌన్సిలర్ భర్తగా వార్డు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వార్డ్ అభివృద్ధికి నిరంతరం శ్రమించారన్నారు. ఆయన మృతి పార్టీకి ,ప్రజలకు తీరని లోటు అన్నారు. మహమూద్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డబ్బికార్ మల్లేష్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ జగదీష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, సిపిఎం పట్టణ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు, కౌన్సిలర్ ఎంఏ ఘని, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి రామ్మూర్తి, పరశురాములు పోలెబోయిన వరలలక్ష్మి, వినోద్ నాయక్, ఆయూబ్, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, జగదీష్ చంద్ర, కృపాకర్ రెడ్డి,గోవర్ధన, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు బక్క శ్రీనివాస్ చారి, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం పాటి శంకర్, నాయకులు పాపిరెడ్డి, లక్ష్మీనారాయణ, రామచంద్ర, కోడైరెక్క మల్లయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు సైదులు బాబు, సోహెబ్, విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య, సూర్యనారాయణ, బిఎం నాయుడు,మంద రాజు,దేవయ్య,యేసు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.