తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

 

రథసారథి ,హైదరాబాద్:

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ ప్రమాణస్వీకార ఉత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ,మల్లికార్జున ఖర్గే ఇతర కాంగ్రెస్ పెద్దలు పాల్గొనగా వారి సమక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మేము పరిపాలకులం కాదు ప్రజా సేవకులమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పునరుద్ధరించారు. ఇక్కడ ప్రమాణస్వీకారం జరుగుతుండగా అక్కడ ప్రజా భవన్ గోడలు బద్దలైయ్యా యనీ ఆయన తెలిపారు. 10 ఏళ్ల నిరంకుశ పాలనకు కాంగ్రెస్ పార్టీ చరమ గీతం పలికిందని ఇకపై ప్రజాపాలన సాగుతుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అమరవీరుల త్యాగఫలం వల్ల ఏర్పడ్డ తెలంగాణ పూర్తి వివక్షకు గురైందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాభవన్ పేరును జ్యోతిభా పూలే ప్రజా భవన్ గా ఆయన నామకరణం చేశారు. రేపు అక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన తొలి సంతకాన్ని ఆరు గ్యారెంటీ ల పథకాన్ని అమలు చేసే అభయ హస్తం ఫైల్ పై సంతకం చేశారు.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తోపాటుగా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.