బడ్జెట్ లో బీసీ లకు రూ. లక్ష కోట్లు కేటాయించాలి: జాజుల

రథ సారథి, మిర్యాలగూడ:

 

జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధి,సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్లో రూ. లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీకి రూ. లక్ష కోట్లు కేటాయించాలని కోరుతూ లేఖ పంపినట్లు జాజుల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నా బీసీలకు ఏ విధమైన రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.52 శాతానికి పైగా ఉన్న బీసీలకు నిధుల కేటాయింపుల్లో ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంది అన్నారు.గత బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, వీటితోటి బీసీలకు చాక్లెట్లు కూడా రావన్నారు.ఎస్సీ,ఎస్టీల మాదిరిగా బీసీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,జయమ్మ,గుండెబోయన నాగేశ్వరరావు యాదవ్,ఎర్రబెల్లి దుర్గయ్య,కవిత,దాసరాజ్ జయరాజ్,చేగొండి మురళి యాదవ్,సావిత్రి,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.