మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చొరవతో వెలుగుల జిలుగులు

రథసారథి, మిర్యాలగూడ:

గత కొద్ది నెలలుగా అంధకారంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ ప్రధాన రోడ్డు నేడు వెలుగులు చిమ్ముతోంది. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఇటీవలే ఈ ప్రధాన రోడ్డుకు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలకు నూతనంగా బల్బులు వేయించారు .గత కొద్ది నెలలుగా ఇక్కడ స్తంభాలకు బల్బులు కాలిపోవడం వల్ల హౌసింగ్ బోర్డ్ లోని ప్రధాన ఈ ఖమ్మం రోడ్డు అంధకారంలో చిక్కుకుంది. ఈ కారణంగా వాహదారులు ,ప్రజలు రాత్రిళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇటీవలే ఈ రోడ్డును కోదాడ నుండి జడ్చర్ల వరకు నేషనల్ హైవేగా మార్చారు. ఈ కారణంగా ఈ రోడ్డుకు బల్బులు హైవే అథారిటీ వారు వేయిస్తారన్న జాప్యం వల్ల ఇక్కడ అంధకారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ రంగంలోకి దిగి ఈ మార్గంలో దెగ్గరుండి మరీ బల్బులు వేయించారు. ఇటీవలే ఈ బల్బుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో ఇక్కడ ఈ ప్రధాన రోడ్డు ప్రస్తుతం రాత్రులు వెలుగులు చిమ్ముతోంది. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.