రామానుజుల వారి మార్గంలో నడవాలి: చిన్న జీయర్ స్వామి
రథ సారథి మిర్యాలగూడ:
పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు బీష్మైకాదశి పురస్కరించుకొని పట్టణానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి అద్వర్యంలో తీర్ధ గోష్టి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి వారు మాట్లాడుతూ భగవత్పాదులు శ్రీ రామానుజం పదంలో ప్రతి ఒక్కరు పయనించాలని, ఆయన మార్గదర్శకత్వం నేటి ఈ సమాజానికి అవసరమ నిపేర్కొన్నారు. ప్రజలు అందరూ సమదృష్టితో వుండాలని కోరారు .కులము ,మతము ,వర్ణాల వల్ల ప్రజల్లో విభేదాలు ఉండకూడదని సమతా భావనే రామానుజుల వారి లక్ష్యం అని చెప్పారు .ఆయన నడిచిన మార్గంలో మనమందరం నడవాలని ఈ సందర్భంగా జీయర్ వారు ఆకాంక్షించారు .కార్యక్రమంలో పాల్గొని శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ దంపతులు, తదితరులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ దంపతులు, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ దంపతులు, ప్రధాన కార్యదర్శి బోగవెళ్ళ వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షులు గుడిపాటి శ్రీనివాస్ దంపతులు, కోశాధికారిపైడిమర్రి సురేష్ దంపతులు, కార్యదర్శి రంగాలింగయ్య దంపతులు తదితరులు పాల్గొన్నారు.