రెండో విడత గొర్రెల పంపిణీ పై చర్యలు చేపట్టాలని మంత్రి తలసానికి వినతి

రథ సారథి, మిర్యాలగూడ:

ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో రెండో విడత గొర్రెల పంపిణి పై చర్చించి చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం మిర్యాలగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్ కోరారు. శనివారం హైదరాబాద్ లో రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రెండవ విడత గొర్రెల పంపిణి కోసం రాష్ట వ్యాప్తంగా వేలాది మంది యాదవ్ లు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గొర్రెల పంపిణి కోసం నిర్ణయం తీసుకున్నప్పటికిని మధ్యలో ఆగి పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. దాంతో స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయన వెంట యాదవ సంఘం నాయకులు రమేష్, అశోక్, హరీష్ యాదవ్, వెంకన్న, ఐలయ్య, అంజియాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.