వార బంది పద్ధతిని ఎత్తివేయాలి: ముదిరెడ్డి నర్సిరెడ్డి
రథ సారథి, మిర్యాలగూడ:
ఆయకట్టు రైతులకు సాగర్ నీటిని వారబంది పద్ధతిలో ఇవ్వటం వలన చివరి భూములకు నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని వారబంది పద్ధతిని వెంటనే ఎత్తివేసి రెగ్యులర్ గా సాగర్ నీటిని విడుదల చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. చివరి భూములకు నీరు అందక పంట పొలాలు మొత్తం ఎండిపోయి నెర్రెలు వారాయని, దాని వలన పంట పొలాలకు అగ్గి తెగులు లాంటి వైరస్ సోకే ప్రమాదం ఉందని ద్వారా చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వెంటనే వారబంధ పద్ధతిని ఎత్తేసి రెగ్యులర్ గా సాగర్ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్థానిక రైతులతో కలిసి నిరసన తెలియజేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య , రాష్ట్ర నాయకులు పగిడి రామలింగయ్య , వేములపల్లి మండల అధ్యక్షుడు మాలికాంతరెడ్డి ,సీనియర్ నాయకులు కాకునూరి బసవయ్య గౌడ్ ,ఓం ప్రకాష్, దామరచర్ల కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు కందుల నరసింహారెడ్డి , మిర్యాలగూడ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలకొప్పుల సైదులు ,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం , ఐఎన్టీయూసీ అధ్యక్షులు చాంద్ పాషా ,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, బిక్షపతి, సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ మాలోతు శివ, అశోక్ ,శ్రీనివాస్ రవి తదితరులు పాల్గొన్నారు.