పల్లెల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే భాస్కర్ రావు

రథ సారథి, మిర్యాలగూడ:

 

పల్లెల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కెసిఆర్ సంకల్పమని చెప్పారు. శనివారం ఆయన వేములపల్లి మండలం లోని 5 గ్రామాలలో ఆమనగల్లు సీసీ రోడ్లకు రూ. 60 లక్షలు, లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీకి రూ. 20 లక్షలు, సీసీ రోడ్డు కు రూ.15 లక్షలు, రావులపెంట పాల ఉత్పత్తి భవనం రూ.5లక్షలు, సీసీ రోడ్లకు రూ. 20 లక్షలు, మంగాపురం గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు ,సీసీ రోడ్డుకు 5 లక్షలు, సల్కునూరు సిసి రోడ్డుకు రూ.20 లక్షలు మొత్తం ఒక రూ. 1.80 కోట్లతో మంజూరైన నిధులతో ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర ముఖద్వారం, రావులపెంట పాల ఉత్పత్తి భవనాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా ఆమనగల్లులో శ్రీ తిరుపతమ్మ దేవాలయ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆమనగల్లు డీజే సౌండ్ లతో మహిళలు కోలాట ప్రదర్శనలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ అభిమతం అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మట్టి రోడ్డులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. మంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలన్ని రూపురేఖలే మారిపోయాయని అన్నారు. తెలంగాణ దేశంలోనే విద్య, వైద్యం, రైతులకు రైతుబంధు రైతు బీమా వంటి పథకాలతో దూసుకుపోతుందని చెప్పారు. దేశంలోలోనే ఎక్కడా లేనివిధంగా ఒంటరి మహిళలకు 2016 రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కిందన్నారు. పేదింటి ఆడపడుచుల కోసం ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి వంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు పేద విద్యార్థులకు సరైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే మన ఊరు.మనబడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం శ్రీరామలింగేశ్వర ముఖద్వారం నిర్మించిన దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాదురి గోవర్ధని, సల్కునూరు సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పృధర్ రెడ్డి, సర్పంచులు వల్లంపట్ల ఝాన్సీ, రావులపెంట సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి చిర్ర మల్లయ్య యాదవ్, చెరుకుపల్లి కృష్ణవేణి సుమన్ ,అంకెపాక రాజు, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పేరాల కృపాకర్ రావు ,కట్ట మల్లేష్ గౌడ్, ఆమనగల్లు రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ యలగపల్లి లక్ష్మి వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి ,ఎంపీటీసీలు, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కోల పాపయ్య, ఉప సర్పంచులు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.