రేపు చింతరెడ్డి ప్రమాణ స్వీకారం

రథ సారథి, నల్గొండ:

నల్గొండ జిల్లా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షునిగా మిర్యాలగూడకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నల్గొండ జిల్లా కేంద్ర వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇట్టి కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి & జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు & ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి లతో పాటుగా రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పోరేషన్ ల చైర్మన్ లు, ఎంపిపి లు, ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు , అన్ని క్లస్టర్ల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పాల్గొంటారు. 

@ అంచెలంచెలుగా ఎదిగి..: మిర్యాలగూడ మండలం యాధ్గార్ పల్లి గ్రామానికి చెందిన చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర వహించారు. విద్యార్థి,ప్రజా సమస్యలపై నిత్యం పోరాడారు. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన ఆయన రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ప్రశంసలు పొందారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోను బీఆర్ఎస్ పార్టీ గెలుపులో ఆయన తనవంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. ఈయన కృషిని గుర్తించిన ప్రభుత్వం రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నియమించింది.

Leave A Reply

Your email address will not be published.