ప్రతి బీసీ విద్యార్థికి 50% ఫీజు రాయితీ కల్పించాలి

 

రథ సారథి,మిర్యాలగూడ:
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలో చదివే బీసీ విద్యార్థులకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ మిర్యాలగూడ ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా లక్షల రూపాయలు దోచుకుంటూ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారనీ అన్నారు. ఎల్ కే జీ విద్యార్థికే కొన్ని ప్రైవేటు పాఠశాలలను 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్న కుడా  విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల పక్షానే వత్తాసు పలకడం విద్యార్థుల తల్లిదండ్రులకు శాపంగా మారింది అన్నారు. విద్యార్థుల దగ్గర్నుంచి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తూ యాజమాన్యాలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అని, రాజకీయ అండదండతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుతూ వారి పబ్బం గడుపుతున్నారని అన్నారు. అందుకని ప్రభుత్వం పేద విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి ప్రతి ప్రైవేటు పాఠశాలలో చదివే ప్రతి బీసీ విద్యార్థికి 50 శాతం ఫీజు రాయితీ కల్పించి విద్యార్థుల పక్షాన ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో.. బీసీ యువజన సంఘం జిల్లా నాయకులు రాచూరి మహేష్ ,బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పోలిశెట్టి అజయ్ ,బీసీ యువజన సంఘం వేములపల్లి మండల అధ్యక్షులు చిలకమర్రి ఇంద్ర చారి ,బీసీ యువజన సంఘం వేములపల్లి మండల ప్రధాన కార్యదర్శి దండగుల యుగేందర్, నాగేందర్ ,భరత్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.