ఘనంగా చింత రెడ్డి ప్రమాణ స్వీకారం

రథ సారథి,నల్గొండ:

నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గా చింత రెడ్డి శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం లో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటుగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో చింతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రైతులకు అందించే పెట్టుబడి సాయంతో పాటుగా, వ్యవసాయానికి సరిపడా కరెంటు అందించటం, రైతు బీమా తదితర సౌకర్యాలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ మంకెన కోటి రెడ్డి,ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కరరావు, భూపాల్ రెడ్డి,రవీంద్ర కుమార్,గాదరి కిషోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ చైర్మన్ లు విజయ సింహ రెడ్డి. బలరాజ్ యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.