బీసీలకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలి: జాజుల

రథ సారథి, మిర్యాలగూడ:

త్వరలో భర్తీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్ధానాల్లో బీసీలకు మూడు స్థానాల్లో  అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కి మొదటి నుంచి బీసీలు అండగా ఉన్నారని జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అదే స్థాయిలో గౌరవ ప్రదమైన పదవులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నారు.మంత్రి పదవులు కూడా బీసీలకు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,జానపాటి రవి,చేగొండి మురళి యాదవ్,అంజి యాదవ్,వెంకటేశ్వర్లు, వంశీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.