బ్రాహ్మణులకు స్థలం కేటాయింపు పై తిరునగర్ భార్గవ్ హామీ
రథ సారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ పట్టణంలో బ్రాహ్మణులకు సమావేశం హాల్ కు స్థలం కేటాయింపు పై మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం మిర్యాలగూడ ఎమ్మెల్యే, శాసనమండలి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తిరునగర్ భార్గవ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక శివాలయం ఆవరణలో స్వర్గీయ తిరునగర్ గంగాధర్ ఆత్మీయ స్మృతి లో భాగంగా బ్రాహ్మణలచే నిర్వహించబడుతున్న పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ శోభకృత్ సంవత్సర పంచాంగ ఆవిష్కరణలో భార్గవ్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ స్వర్గీయ తిరునగర్ గంగాధర్ మిర్యాలగూడ గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించారని, దానిని మున్సిపల్ స్థాయికి పెంచిన ఘనత ఆయనదేనని చెప్పారు. ప్రధానంగా పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి మిర్యాలగూడకు మంచినీటిని పంపిణీ చేయించి ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చిన మహనీయుడని ఆయన బాటలో తాను నడుస్తున్నానని బ్రాహ్మణ మిత్రులందరు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పులి కృష్ణమూర్తి, పుల్ల భట్ల లక్ష్మీనారాయణ శర్మ , భైరభట్ల రాంబాబు శర్మ, రాధాకృష్ణశర్మ ,చిట్యాల శ్రీనివాస్ శర్మ ,స్వయంపాకుల లక్ష్మీ నరసయ్య శర్మ, భాన్నారాయణ శర్మ, శివాలయం ధర్మకర్తల సభ్యుడు రేపాల రమేష్, తిరు నగర్ కుటుంబ సభ్యులైన భరత్ కుమార్ , మల్లేశ్వరమ్మ, రాయపూడి భవాని దంపతులు పాల్గొన్నారు. స్వర్గీయ తిరునగరుగంగాధర్ జ్ఞాపకార్థం బ్రాహ్మణ మిత్రులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగము, బ్యాగు, ఫలములు, దక్షిణను ఇచ్చారు.