ప్రీతి మరణానికి కారణమైన సైఫ్ ను ఉరితీయాలి: జాజుల
రథసారథి, మిర్యాలగూడ:
వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న ధరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సైఫ్ ను బహిరంగంగా ఉరి తీయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాలేజీలలో యాంటీ ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలి.ఫిర్యాదు చేసిన పట్టించుకోని కాకతీయ మెడికల్ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని అన్నారు.ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు.ఆమె మరణం అత్యంత విషాధకారం.ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని,ఆమె మరణమునకు చింతిస్తూ బీసీ సంక్షేమ సంఘం పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు.