ఫీజుల పేరిట హాల్ టికెట్లు ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం: పరంగి రాము

రథ సారథి,మిర్యాలగూడ 

నల్లగొండ జిల్లాలో విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏ ఐ ఎస్ బి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. పరంగి రాము కోరారు.మిర్యాలగూడలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పగలంతా పరిక్షలకు వెళ్లి రాత్రిపూట చదువుకు సిద్ధం కావలసి ఉంటుందని కానీ వేళా పాళా లేకుండా కరెంట్ కోతలు పెడుతున్నారని,కరెంటు పోయిన ప్రతిసారి విద్యార్థుల యోక్క ఏకగ్రత దెబ్బతింటుందన్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున చదువు ప్రశాంతంగా సాగుతుందని కరెంట్ పోయినప్పుడల్లా తిరిగి రావడానికి అరగంట, గంట సమయం పడుతుందని ఇట్టి సమస్యను సరిదిద్దాలని అధికారులను కోరారు. 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్-5 నుంచి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి-15 నుంచి, పాలిటెక్నిక్ పరీక్షలు ఏప్రిల్-24 నుంచి మొదలవుతాయని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదివిస్తున్నారని విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం గంటల తరబడి చదవాల్సి వస్తుందని తెలిపారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు ఇచ్చిందని వాటికోసం సిద్ధమవుతున్న వారికి కరెంటు కోతలు అవరోధంగా మారుతున్నాయి అని విమర్శించారు. మార్చి ఆరంభంలోనే ఇలా ఉందని ఏప్రిల్ లోను పరీక్షలు ఉన్నాయని తలచుకుంటేనే భయమేస్తుందని ప్రభుత్వ అధికారులు వెంటనే శ్రద్ధ పెట్టాలని కోరారు. అదేవిధంగా పరిక్షలు నిర్వహించనున్న సందర్భంగా విద్యాసంస్థలు విద్యార్థులకు హల్ టికెట్లు ఇచ్చే సమయంలో ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే విద్యాసంస్థల ముందు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగతామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలోఏ ఐ ఎస్ బి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు. యంఏ.హంజఖాద్రీ, ఎద్దు ప్రవీణ్, కొండలు, రాము, నాగార్జున, మధు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.