జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు
రథ సారథి, మిర్యాలగూడ:
జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు , ఆర్డివో చెన్నయ్యలు హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ స్మాల్ మీడియం డైలీమంత్లీ అసోసియేషన్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు ను కలిశారు. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములను గుర్తించి తక్షణమే పంపిణీకి చర్యలు తీసుకోవాలని జిల్లా సర్వేయర్ బాలాజీ నాయక్ ను ఆదేశించారు. అర్హులైన జర్నలిస్టుల జాబితాను ఇవ్వాలని ఆర్డీవో కు సూచించారు. త్వరలోనే అందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు జర్నలిస్టుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.