కార్యకర్తను పరామర్శించిన ఎన్బీఆర్ఎఫ్ చైర్మన్ సిద్దార్థ…

 

రథ సారథి,మిర్యాలగూడ:

గాయానికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తను ఎన్ బీ ఆర్ ఎఫ్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు . శుక్రవారం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి విస్తరణ శంకుస్థాపనకు విచ్చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వాహనం ..బీఆర్ఎస్ సభకు వచ్చిన మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చిట్యాల సైదులు కు తగిలింది. సైదులుకు చిన్నపాటి గాయమైంది. స్థానిక కార్యకర్తలు సైదులు ను వెంటనే ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. సైదులు కు మెరుగైన చికిత్స అందించాలని సిద్ధార్థ డాక్టర్లకు సూచించారు. మందులకు ఇతర వైద్య సేవలకు సైదులుకు 5 వేల రూపాయలు ఆర్థిక సాయం సిద్ధార్థ అందజేశారు.కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అనీ ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.