వీర కోటిరెడ్డిని సన్మానించిన ముస్లిం నాయకులు
రథసారథి, దామరచర్ల:(రామకృష్ణారావు):
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన కుందూరు వీరకోటి రెడ్డి ని దామరచర్ల బీ ఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు మరియు అభిమానులు పూలమాలలు(గజ్ర/పుదీన హార్) వేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల ముస్లిం మత పెద్ద సదర్ సాబ్(ఎండి ఖాసిం) , బి ఆర్ ఎస్ మైనార్టీ యువజన సంఘం నేత రఫీ, హుస్సేన్, బాల్చి, మెకానిక్ బాబు, కోప్షన్ నెంబర్ నాగుల్ మీరా,బుడ్డు,మోదీన్,రహీం,సత్తార్,మైబలి,హజి,బాజాన్,శైద,రంజాన్,ఇమాంస,గౌస్,నజీర్,అక్బర్,షఫీ,ఖాసిం మరియు మైనారిటీ యువకులు మరియు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుందూరు వీరకోటి రెడ్డి మాట్లాడుతూ దామరచర్ల మండల కేంద్రంలోని ముస్లిం సమాజాని కి తన వంతు సహాయశక్తులు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.రంజాన్ ,బక్రీద్ పండుగల కు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి ఇబ్బంది కరంగా ఉంది అన్న క్రమం లో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నల్లమోతు భాస్కర్ రావు దృష్టికి తీసుకు వెళ్లి ఈద్గా ని డెవలప్(మరమ్మత్తులు)చేసి ప్రార్ధనలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది.