ఘనంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

రథ సారథి, మిర్యాలగూడ:

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, నల్లగొండ అభివృద్ధి ప్రధాత గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అద్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మండల రైతు సమితి అద్యక్షులు గడగొజు ఏడుకొండలు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు భోగవెళ్ళి వెంకటరమణ చౌదరి, కొత్త మర్రెడ్డి, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.