ఘనంగా స్వామి వారి కళ్యాణం

రథ సారథి,మిర్యాలగూడ:
మిర్యాలగూడ మండలం అవంతీపురం గుట్ట పై వేంచేసి వున్న
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురువారం ఘనంగా జరిగింది. వేలాది గా భక్తులు తరలి రాగా వేద పండితులు స్వామి వారి శాంతి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వ హించారు. ఎమ్మెల్యే ఎన్. భాస్కర్ రావు, ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయ సింహా రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆలయ చైర్మన్ డాక్టర్ శరత్ బాబు, కుక్కడ పు రామ్మూర్తి, శ్రీనివాస్ ,శంకర్, డాక్టర్ ప్రశాంత్, రామకోటేశ్వరరావు ,వంశీధర్, సత్యనారాయణ ,సర్పంచ్ దుగ్యాల ఎంకన్న ,ఎంపీటీసీ వల్దాస్ సుజాత సురేష్, రాంబాబు, చిమట పద్మ మాధార్ ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. ఇక్కడే వేంచేసియున్న శ్రీ సరస్వతీ దేవాలయం లో వసంత పంచమి సంధర్భంగా వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.