ఇళ్ల స్థలాలకై చెవిలో పువ్వు లతో జర్నలిస్టుల ధర్నా..
* మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు
రథసారథి-మిర్యాలగూడ
జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు వెంటనే ఇవ్వాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ జర్నలిస్టులు మంగళవారం వినూత్నంగా ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించగా సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, బిజెపి, టిడిపి, బీఎస్పీ, ఏఐఎఫ్బి, ఇతర ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులకు సంఘీభావంగా మద్దతు తెలిపారు. కబ్జాదారు నుండి ప్రభుత్వ భూములు కాపాడాలని, అధికారులు పాలకులు నిర్లక్ష్యం విడనాడి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను అరికట్టాలని, ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలోని డి ఏ ఓ రాధాకు వినతిపత్రం సమర్పించారు.
@ ఆగస్టు 15లోగా పట్టాలు అందజేయాలి:మాజీ ఎమ్మెల్యే జులకంటి :నిత్యం సామాజిక బాధ్యతలు ప్రజాసేవలో ఉండే జర్నలిస్టు పట్ల అధికారులు పాలకులు నిర్లక్ష్యం వీడి ఆగస్టు 15లోగా ఇళ్లస్థలాల పట్టాలు అందజేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పాలకులు, అధికారుల హామీ మేరకు ప్రభుత్వ భూమి గుర్తించి 10 లక్షలు ఖర్చు చేసి భూమిని చదును చేసుకుంటే అధికార పార్టీ నాయకులు ఇప్పుడు అడ్డుపడడం సరైనది కాదన్నారు.జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాల న్నారు.
నాన్న పేరుతో 10 గుంటల భూమిని కబ్జా …బిఎల్ఆర్ ..కాంగ్రెస్: నాన్న పేరుతో 10 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 10 ఫీట్ల ఎత్తు మేరకు ప్రహరీ గోడ నిర్మించారని కాంగ్రెస్ మున్సిపల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. విలువైన భూమిని కబ్జా చేసిన అధికారులు పట్టించుకోవడం శోచనీయమన్నారు. ఇప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మరో మూడు నెలలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు మంచి భూములను కేటాయిస్తామని చెప్పారు.తక్షణమే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి :సిపిఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు :తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు కోరారు.బలమైన ఉద్యమాలు చేపట్టాలి :బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జే. రాజు: పే దరికంలో మగ్గుతున్న జర్నలిస్టులకు తక్షణమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, దీనికోసం బలమైన ఉద్యమాలు చేపట్టాలని డాక్టర్ జే.రాజు కోరారు. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బిజెపి నియోజకవర్గ నాయకుడు సాధినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.జర్నలిస్టుల ఆందోళనకు తమ పూర్తి మద్దతిస్తామని టిడిపి పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షులు పరంగి రాము, ప్రజా సంఘాల నాయకులు సిద్దు నాయక్, దినేష్ ఎరుకల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు వజ్రగిరి అంజయ్య లు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ ఇతర నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఖాజా హమీదుద్దీన్, జర్నలిస్టులు ఆయూబ్, వెంకన్న, మహేష్, అస్లాం, నజిమోద్దీన్, మంద సైదులు, వంశీ, బాస్కర్ మనోజ్, నరేందర్ రెడ్డి, నాగచారి రమేష్, జయరాజు, అరుణ్, నాగరాజు, బండ వేణుగోపాల్ రెడ్డి, రమేష్ నాయక్, రామకృష్ణా రావు,ఉమర్, రఫీ, నాగేందర్, శ్రీను, శ్యామ్, నర్సింహ, సైదులు, మహేష్, సురేష్, శ్రీనివాస్ రెడ్డి, ఉమ మహేశ్వర్,కట్ట బాబు, హరీష్ వినయ్, సాగర్, మధు, శ్రీను, బురన్,తదితరులు పాల్గొన్నారు.