అమరుల త్యాగ ఫలాలు నేడు నిజమవుతున్నాయి
-నైజాం విముక్త స్వాతంత్య్ర అమృత్సవ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
రథసారథి ,మిర్యాలగూడ :
ప్రపంచంలోనే భారతదేశం ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందని నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు రాయపూడి జగన్మోహన్ రావు, డాక్టర్ మురళీకృష్ణ, ప్రముఖ న్యాయవాది గూడూరు శ్రీనివాసరావులు అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ప్రకాష్ నగర్ లో గల ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వారు పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఎందరో అమరుల త్యాగ ఫలాలు నేడు నిజమవుతున్నాయని తెలిపారు. గత పదిఏళ్ళ నుండి భారతదేశం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో మన భారతీయులు అనేక రంగాల్లో రాణిస్తూ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బొడ్డుపల్లి రామకృష్ణ, రామకృష్ణ కట్టర్, లోకేష్, నవీన్, కంచర్ల అనంతరెడ్డి, వసంత, సుధాకర్, భరత్, సంధ్య తదితరులు ఉన్నారు.