మళ్లీ భాస్కర్ రావు కే బీఆర్ఎస్ టికెట్

రథసారథి, మిర్యాలగూడ:

ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి దఫా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కే మళ్లీ పార్టీ టికెట్ కేటాయించారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థిత్వం ఖరారు చేసినందుకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్ రావుకు నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, డి.సి.యం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మట్టపల్లి సైదులు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, ఎంపిపి ధనవాత్ బాలాజీ నాయక్, జడ్పిటిసిలు సేవ్యా నాయక్, లలితా హతిరం నాయక్, ఏండి యూసుఫ్, మాజీ ఏ ఎమ్ సి చైర్మన్ చిట్టిబాబు, జొన్నలగడ్డ రంగారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎం.పి.టి.సిలు, బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.