జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

రథ సారథి,హైదరాబాద్:

ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ జమున (86) అంత్యక్రియలు ఈ రోజే జరగనున్నాయి.హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానం లో ఆమె అంత్య క్రియలు సాయంత్రం జరగ నున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.