తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా

రథసారధి:

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబరు 30వ తేదీన తెలంగాణకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అనీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు.

తెలంగాణ ఎన్నికల తేదీలు ఇ లా ఉన్నాయి.నవంబర్ 3నోటిఫికేషన్ తేదీ కాగా,నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ నవంబరు 10.నామినేషన్ల పరిశీలన తేదీ నవంబరు 13 కాగా,నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబరు 15.పోలింగ్‌ తేదీ నవంబరు 30.ఓట్ల లెక్కింపు తేదీ డిసెంబరు 3.తెలంగాణ లో మొత్తం 119 నియోజకవర్గాలుండగా…. మధ్యప్రదేశ్‌ లో 230, రాజస్థాన్‌ లో 200, ఛత్తీస్‌గఢ్‌ లో 90, మిజోరం లో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో భారాస, మధ్యప్రదేశ్‌లో భాజపా, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.