ముఖ్యమంత్రి సభా స్థలి పరిశీలన
రథ సారథి, మిర్యాలగూడ:
మంగళవారం మధ్యాహ్నం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ మైదానంలో ముఖ్య మంత్రి కేసీఅర్ ఆ శీర్వాద సభ ఏర్పాట్లను మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగర్ భార్గవ్ , నల్లమోతు సిద్ధార్థ,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి పలువురు నాయకులు ఉన్నారు. రేపు జరిగే కెసిఆర్ సభకు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కెసిఆర్ ని ఆశీర్వదించ వలసిందిగా మరియు విజయవంతం చేయవలసిందిగా పత్రిక ముఖంగా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు కోరారు.