బిజెపి అభ్యర్థిగా సాధినేని శ్రీనివాస్ నామినేషన్..

రథసారథి ,మిర్యాలగూడ:

మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా సాధినేని శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంత కు ముందు ఆయన పట్టణంలో బిజెపి శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా సాధినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చాప కింద నీరులా బిజెపి పాగా వేయనున్నది అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన సాగించారని ఆయన విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ ను, బిఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. యువకులు, మహిళలు, మేధావులు, రైతులు అందరూ ఈ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారును తీసుకొని రావాలన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మిర్యాలగూడను జిల్లా చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తానని, నియోజకవర్గాన్ని సర్వతో ముఖాభివృద్దిగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ఆయన వెంట కర్నాటి ప్రభాకర్, దొండపాటి వెంకటరెడ్డి, రతన్ సింగ్, పురుషోత్తం రెడ్డి, హనుమంత్ రెడ్డి ,అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.