ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన

రథసారథి, హాలియా:

హాలియా పట్టణంలో మంగళవారం జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభను నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వారు హెలిపాడ్ తో పాటుగా, సభా స్థలినీ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్, ఎంపీపీలు ఆంగోతు భగవాన్ నాయక్, ఆవుల పురుషోత్తం యాదవ్, మర్ల చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు సాదం సంపత్ కుమార్,కర్ణ బ్రహ్మ రెడ్డి,గుండెబోయినా కోటేష్,వడ్డే సతీష్ రెడ్డి,సురభి రాంబాబు, అల్లి పెద్దిరాజు, రావుల లింగయ్య,గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ సుధాకర్, మంద రఘు వీర్ భిన్ని,సర్పంచ్ లు కుందారపు సైదులు, మేరెడ్డి వెంకట్ రెడ్డి,అబ్దుల్ హలీం,అంజాద్ ఖాన్, మాతంగి కాషయ్య,కలకొండ వెంకటేశ్వర్లు,జలీల్,గుంటుక మధుసుదన్ రెడ్డి,కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి,ఆవుదొడ్డి రాహుల్, నడ్డి బాలరాజు,సలీం, జానీ,సైదా చారి, బండి రమేష్, పేర్ల సైదులు, మద్దిమడుగు మార్క్, హుస్సేన్, బెజవాడ కృష్ణ,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.