బిఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

రథసారథి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ మండలం , రాయినిపాలెం గ్రామం నుంచి 200 మంది టిఆర్ఎస్ పార్టీ నించి సోమవారం బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రసిడెంట్ బసవయ్య , ఎంపీటీసీ జగయ్య, మురళి, పొలగాని వెంకట్ తదితర నాయకులు పాల్గొన్నారు.అలాగే మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ కి చెందిన 200 మంది బీఆర్ఎస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరడం జరిగింది.మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన తిప్పన రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బీ ఆర్ఎస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంగాల కృష్ణారెడ్డి, తిప్పన రాంరెడ్డి, గున్ రెడ్డి బుచ్చి రెడ్డి, జెట్టి చంద్రయ్య, పగిడిపల్లి మట్టయ్య, జంపాల నరేష్, తిప్పన నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన 50 మంది బీసీ విద్యార్థి సంఘం నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో మేకల శ్రీనివాస్ గారి అధ్వర్యంలో వారి మిత్ర బృందం 2000 మంది, మరియు బాల రాజు, అశోక్ గారి అధ్వర్యంలో 500 మంది,14 వ వార్డుకు చెందిన నర్సింగ్ బలరాం, రమేష్ అధ్వర్యంలో 500మంది 43,44,48వ వార్డు రాకేష్ గారి అధ్వర్యంలో సోమ గానీ రుకేష్, సోమగానీ శ్రీను 19 వ వార్డు గంట శ్రీనివాస్ సోమగని మహేష్ , మరియు పట్టణంలోని వివిధ వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరడం జరిగింది. మరియు మిర్యాలగూడ పట్టణంలోనీ వివిధ వార్డుల నుండిబి ఎల్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.