బీఎల్ఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
రథసారధి, వేములపల్లి:
ఈరోజు వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని టిఆర్ఎస్ పార్టీ ఈ తొమ్మిదేళ్లు రాష్ట్రంలో అరాచక పాలన గుండాయిజం భూకబ్జాలు ప్రభుత్వ పథకాలు కూడా కేవలం టిఆర్ఎస్ నాయకుల చెంచాలకు మాత్రమే అందాయే తప్ప తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆరు గ్యారంటీల పథకాన్ని ప్రజలకు కచ్చితంగా నెరవేరుస్తామని ప్రచారంలో భాగంగా ఆయన అన్నారు. అదేవిధంగా బి ఎల్ ఆర్ బ్రదర్స్ తరఫున కూడా ఒక ప్రత్యేక మ్యానిఫెస్టో పెట్టి అన్ని వర్గాల ప్రజలకు కావలసిన ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఏ విధంగా మిర్యాలగూడ నియోజకవర్గం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు అన్నీ కూడా మిర్యాలగూడ వైపు చూసే విధంగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు, జిల్లా నాయకులు ,బ్లాక్ ప్రెసిడెంట్ లు, మండల ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.