భాస్కర్ రావుకు ఘన స్వాగతం
రథసారధి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో బాగముగా 20,21 వార్డులో రెడ్డి కాలనీ నందు బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమామిళ్ల వేణుగోపాలరావు మరియు కందగండ్ల అశోక్ నాయకత్వములో భారీగా జనం తో 2000 మంధి ప్రజలతో మిర్యాలగూడ బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావుకి హారతులతో ఘనంగా స్వగతం పలికారు.అధేవిధముగా చిరుమామిళ్ల అనూష చౌదరి అధ్వర్యములో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించి, ఆ భగవంతుని అశీసులు ఉండాలనీ, భారీ మెజారిటీ తో గెలవాలి అని ప్రసాదం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు జిల్లా అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మమత , మున్సిపల్ చైర్మన్ తిరుగునర్ భార్గవ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు , నూకల సరళ హనుమంత్ రెడ్డి , మార్కెట్ డైరెక్టర్లు రాము మరియు గణేష్, ముక్కా రామ్మూర్తి, మాశెట్టి శివ,పగిడిమర్రి సురేష్ మరియు రంగనాథ్, అనుముల మధుసూధన్ రెడ్డి, కంచర్ల అనంతరెడ్డి,ఇంద్ర రెడ్డి గార్లు ,మరియు ప్రముఖులు పాల్గొనారు.