కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

రథసారథి ,మిర్యాలగూడ:

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల నుంచి బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో దాదాపు 2వేల మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ గ్రామం నుంచి బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ దారం సైదులు, బీ ఆర్ ఎస్ వార్డ్ మెంబర్ శ్రీలోజు సైథా చారి, బీ ఆర్ ఎస్ మైనారిటీ అధ్యక్షులు మహ్మద్ సలీం, బీ ఆర్ ఎస్ యూత్ నర్సింగోజ్ సైదులు లతో పాటు నాయకులు 100 మంది బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాగిరెడ్డి జగ్గా రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కొండా జోష్, ఉపాధ్యక్షులు అమరారపు శ్రీను, బొడ్డు వెంకన్న, కుర్ర వెంకన్న, పోలగాని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

మిర్యాలగూడ పట్టణంలోని 15వ వార్డ్ కౌన్సిలర్ రునాల్ రెడ్డి, మెరెడ్ల వెంకట రెడ్డి గార్ల ఆధ్వర్యంలో బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో 100 మంది మహిళలు మరియు వార్డ్ నాయకులు చేరారు.వేములపల్లి మండలం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు చలబొట్ల శ్రీనివాస్ రెడ్డి, ముదిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది బీ ఆర్ ఎస్ నాయకులు , బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పుట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

గోగువారి గూడెం గ్రామానికి చెందిన 50 మంది బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.