ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి : సీఎం కేసీఆర్

 

రథసారధి ,హాలియా:

ఎన్నికలు వస్తూంటాయి.. పోతాయి..అంతిమంగా ప్రజాస్వామ్యం గెలవాలి.. ఓటు అనేది తల రాతలు మారుస్తుంది..మంచి చెడు ఆలోచన చేసి ఓటయ్యాలి…ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి..అభ్యర్థి ఎవరు ? ఎలాంటి వారు అనేది ఆలోచన చేయాలి.. పార్టీల చరిత్ర ఎంది అనేది ఆలోచన చేయాలి…రాష్ట్రం సురక్షితంగా ఉండాలి అంటే మంచి పార్టీకి ఓటయ్యాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హాలియా పట్టణంలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీ ఆర్ ఎస్ పార్టీ పుట్టినదే తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం అన్నారు.50 సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్…. మరి ఏం జరిగింది..? మీ తండాల్లో పోయి ఆలోచన చేయాలి…తెలంగాణ వచ్చిన కోత్తలో పరిస్థితి అగమ్యగోచరంగా వుండే… కరంట్ విషయం లో మంచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న కెసిఆర్ అన్నారు.2 ఏళ్ళలో 24 గంటల కరంట్ ఇవ్వాలని అసెంబ్లీ లో ప్రకటించిన.అప్పుడు జానారెడ్డి అనే పెద్ద నాయకుడు నాతో ఛాలెంజ్ చేసిండు..24 గంటలు కరంట్ ఇస్తే గులాబీ కండువా వేసుకుంటా అన్నాడు…కరంట్ ఇచ్చి చూపించా.. మరి జానారెడ్డి మాత్రం మాట మీద నిలబడలేదు అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.మొన్నటి ఉప ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు జానారెడ్డి కి,జానారెడ్డి సీఎం అవుతా అని పగటి కలలు కంటున్నాడు అని కెసిఆర్ పేర్కొన్నారు. సాగర్ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం,నీటి తీరువ బకాయిలను రద్దు చేసినం,అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో నీటి తిరువా ముక్కు పిండి వసూలు చేసేది అనీ కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.అన్నదాతలకు 24 గంటలు ఉచిత కరంట్ ఇస్తున్నాం అనీ,ధరణి తెచ్చి అవినీతి ని రూపుమాపినాము అన్నారు.రైతు బంధు పథకం దుబారా చేస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ అంటున్నాడు,రైతు బంధు వుండాలంటే నాగార్జునసాగర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి భగత్ గెలవాలనీ , రాష్ట్రంలో బీ ఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి అనీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు ,24 గంటలు కరంట్ ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలనీ,ధరణి ని రద్దు చేస్తాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు..ధరణి వద్దు అంటున్న కాంగ్రెస్ వాళ్ళను గంగలో కలపా లన్నారు.రాహుల్ గాంధీ, భట్టి, రేవంత్ సహా అందరూ ధరణి వద్దు అంటున్నారనీ ,పెద్ద ప్రమాదం పొంచి ఉందనీ,పెన్షన్ రూ .5 వేలు కావాలంటే బి ఆర్ ఎస్ గెలవాలనీ, ఆగమాగం కావొద్దు అన్నారు సీఎం కేసీర్ . గ్రామాల్లో ఏది నిజమో చెప్పాలనీ,కాంగ్రెస్ అంటేనే దోపిడీ అన్నారు.మార్చి నెల తర్వాత అందరికి సన్న బియ్యం ఇస్తా మనీ ,నాగార్జున సాగర్ లో అన్ని పనులు చేస్తాం అనీ,పొరపాటున కాంగ్రెస్ వస్తే కరంట్ రాదు,దళిత బంధు రద్దు చేస్తారు అన్నారు.కాంగ్రెస్ వస్తే వైకుంఠ పాళీ ఆటలో పెద్ద పాము చిన్న పామును మింగినట్టు అవుతాది అనీ,గొల్ల కుర్మ లకు గొర్రెలు ఇచ్చింది బీ ఆర్ ఎస్ పార్టీ అని,కాంగ్రెస్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది అన్నారు .ముఖ్యంగా అన్నదాతలు ఆగం అవుతారనీ, ఇక్కడ పోటీలో వున్న భగత్ యువకుడు,మంచి సేవ చేస్తాడు అనీ,ఉత్సాహం ఉంది,విద్యావంతుడు,ఆయనను భారీ మెజార్టీతో గెలిపించండి అనీ,అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత ప్రజలదేనని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి భగత్ కుమార్ మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.