చిత్రలేఖనం పోటీలో ప్రథమ స్థానం

రథసారథి, మిర్యాలగూడ:

నల్లగొండ డైట్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన కళా ఉత్సవ్ – 2023 జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలగడప కు చెందిన తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని గోగుల శాభారాణి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొంది, రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైనది.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలగడప ప్రధానోపాధ్యాయులు కొత్త రాఘవేంద్ర ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు ఆర్ట్ టీచర్ దైద రామకృష్ణ విద్యార్థిని ని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.