80 శాతం నా సంపాదన పేద ప్రజల అభివృద్ధికి కేటాయిస్తా… బత్తుల లక్ష్మారెడ్డి…
రథసారథి, మిర్యాలగూడ:
ఈరోజు స్థానిక సుందర్ నగర్ లో కౌన్సిలర్ గుంజా చంద్రకళ శ్రీనివాస్ 36వ వార్డ్ ఇంచార్జ్ అబ్దుల్లా విష్ణు ఆధ్వర్యంలో దాదాపుగా 200 మంది బీ ఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో బిఎల్ఆర్ సమక్షంలో చేరడం జరిగింది. ఊట్లపల్లి గ్రామంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ మన్యం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తడకమళ్ళ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు సైదిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది బీ ఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.అవంతిపురం గ్రామంలో ఉప్పు తల మహేష్ ఆధ్వర్యంలో 100 మంది ఆమ్ ఆద్మీ , టిఆర్ఎస్, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ సుందర్ నగర్ వార్డు తో , వార్డు ప్రజలతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఈ వార్డు కౌన్సిలర్ గుంజా చంద్రకళ శ్రీనివాస్ నిరంతరం ప్రజల బాగోగుల కోసం పరితపిస్తూ ఉంటుందని అన్నారు. మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను వార్డు ప్రజలకు అందేలా ఈ వార్డులో వివాహం చేసుకున్నటువంటి నిరుపేద ఆడపడుచులకు మా బి ఎల్ ఆర్ బ్రదర్స్ శ్రీ శ్రీనివాస కళ్యాణం మస్తు, వివాహ కిట్లను అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఇంటింటికి కూరగాయలను అదేవిధంగా ఆనందయ్య గారి ఆయుర్వేద మందులు ప్రతి గడపకు అందజేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ మొత్తం కూడా అర్హులైనటువంటి ప్రతి ఆడపడుచులకు శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు కిట్లను అదేవిధంగా యువతకు హెల్మెట్లను కరోనా కష్టకాలంలో నియోజకవర్గ మొత్తం కూడా ప్రతి గడపకు ఆనందయ్య కరోనా మందులు అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడలో అదేవిధంగా దామచర్లలో రెండు పర్యాయాలు మెగా హెల్త్ క్యాంపులను నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు చేయించి వారికి మందులను కూడా ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు. నాకు శాసనసభ్యుడుగా అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తానని నా సంపాదనలో 80% మిర్యాలగూడ నియోజకవర్గ పేద ప్రజల కోసం అభివృద్ధి కోసం వెచ్చిస్తానని మీరందరూ నన్ను ఆదరించి హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను అని బత్తుల లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, డిసిసి జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిలి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి , మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు గుంజా చంద్రకళా శ్రీనివాస్, దేశిడి శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ వార్డు ఇన్చార్జులు అబ్దుల్లా విష్ణు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.