డప్పులు, కోలాటాలతో భగత్ కుమార్ కు ఘన స్వాగతం..

 

రథసారధి ,గుర్రంపోడు:

 

గుర్రంపోడ్ మండలం, కాచారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి తో కలిసి బుధవారం ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ కు గ్రామస్తులు డప్పులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భగత్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరిగాయని తనను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి మరింతగా తీసుకొని వెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంచికటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, మేకల వెంకట్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి రాంగిరి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ వజ్జ దనుజయ్య, గార్లపాటి శేఖర్, దైద శ్రీనివాస్ రెడ్డి,వెలుగు రవి, గుర్రం అమరేందర్, మండల యూత్ ప్రసిడెంట్ కుప్ప పృధ్వీ, మండల యూత్ ప్రధాన కార్య దర్శి వేముల యాదయ్యా, యువజన నాయకులు కూను సైది రెడ్డి,మేకల నాగిరెడ్డి, ఎస్సీ సేల్ మండల ప్రధాన కార్యదర్శి మేది వెంకన్న,మైనార్టీ సెల్ నాయకు షేక్ అమీర్, ,మహ్మద్ ఖాసీం,పులిమొని సైదులు, ఓగు పెద్దలు,నజీర్,నల్ల శంకర్, నల్ల కృష్ణ,జిల్లా సైదులు, సిహెచ్ కర్ణాకర్, వెంకన్న,బోజమొని వెంకయ్య, పిడిగం అంజనేలు, తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.