ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దు… ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు

రథ సారథి,మిర్యాలగూడ:

ఎన్నికలవేళ ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని మిర్యాలగూడ అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం అడవులపల్లి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలవేళ మనలో మనకే చీలికలు వచ్చేలా ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు పన్నుతాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మన ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు, పెన్షన్లు వాటి విషయాలపై ఓటర్లకు వివరించాలని భాస్కరరావు సూచించారు. బిఆర్ఎస్ మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి వివరించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో ర్యాలీలు, సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ కారు గుర్తుకు అధిక మెజార్టీ వచ్చేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని భాస్కరరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, జెడ్ పి టి సి కుర్ర సేవ్యా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, వైస్ ఎంపీపీ కూరాకుల మల్లీశ్వరి గోపీనాథ్, కుర్ర శ్రీను, కొత్త మర్రెడ్డి, సూర్య నాయక్ ,పాతులోతు బాలాజీ నాయక్, చందు, రామకోటి, సక్రు,సోమ, కొండలు, రాజలింగం, సింగన్న శ్రీను వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.