ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదములు..
రథ సారథి, హాలియా:
హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఆశీర్వాద సభను విజయవంతం చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ, పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టైక ఆఫ్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య లు తెలిపారు .బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారూ మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రభావంతో రాబోవు నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అనీ వారు పేర్కొన్నారు. సంక్షేమమే పణంగా పెట్టి నిరంతరం ప్రజల కోసం భగత్ పనిచేశారు అని వారు అన్నారు .ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి నోముల భగత్ కుమార్ ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ), కౌన్సిలర్లు హిరేఖ, రమేష్ జీ, మంగత నాయక్, మోహన్ నాయక్, చైర్పర్సన్ ముఖ్య సలహాదారుడు కర్ణ శరత్ రెడ్డి, బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.