బీఎల్ఆర్ విస్తృత ప్రచారం
రథసారథ ,అడవిదేవులపల్లి:
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా అడవిదేవులపల్లి మండలంలోని చింత చెట్టు తండా, బంగారి కుంట తండా, ముల్క చెర్ల, బాలాజీ తండా, బాలెం పల్లి, చిట్యాల గ్రామాలలో పర్యటించడం జరిగింది . మధ్యాహ్నం స్వల్ప విరామం తర్వాత కొత్త నందికొండ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది అని తెలిపారు . గ్రామ గ్రామాన వారికి ఆత్మీయ ఆహ్వానం పలకడంతో పాటు బత్తుల లక్ష్మారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన కొందరు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు బీ ఎల్ ఆర్ సమక్షంలో బాలాజీ తండా కు చెందిన పాతులోతు రమేష్, టిక్య, అశోక్, జతవత్ సేవులు బీ ఆర్ ఎస్ పార్టీ వార్డ్ మెంబెర్స్, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బత్తుల లక్ష్మారెడ్డి అధికారంలో లేకపోయినా, ఎటువంటి పదవులు లేకపోయినా వారి సొంత డబ్బుతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి నాయకుడిని గెలిపించేందుకు మేము కృషి చేస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొదిల శ్రీనివాస్ , మండల పార్టీ ప్రెసిడెంట్ బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.