నాపై ఐటి దాడులు అవాస్తవం: భాస్కరరావు
రథసారధి, మిర్యాలగూడ:
ఐటి సోదాలపై మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కరరావు స్పందించారు.వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో ఆయన మిర్యాల గూడ పట్టణంలో జరుగుతున్న ఐటీ దాడుల విషయాన్ని తెలుసుకొని..ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం అన్నారు.నా బంధువులపైన గాని, నా కుమారుల ఇంట్లో గానీ ఐటి సోదాలు జరగట్లేదు,నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను..? అన్నారు.నాకు పవర్ ప్లాంట్ లు ఉన్నాయన్నది అపోహ మాత్రమే,నాపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి అనీ ఆయన తెలిపారు. ఇలా అపోహలు సృష్టించి మిర్యాలగూడ పట్టణంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.