అభివృద్ధి ,సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానం.

 

రథసారథి ,వేములపల్లి:

బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ప్రభావానికి ఆకర్షితులై గ్రామాలలో యువకులు, మేధావులు, మహిళలు బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.గురువారం వేములపల్లి మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ దేశిరెడ్డి లక్ష్మి శేకర్రెడ్డి, మాజీ సర్పంచ్ పాల్వాయి శంకర్ ల ఆధ్వర్యంలో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 25 కుటుంబాల వారు ఆయా పార్టీలకు రాజీనామా చేసి, బిఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే గారు స్వాగతించారు.గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు అవగాహన చేయించి, ఈనెల 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.బిఆర్ఎస్ లో చేరిన వారిలో పుట్టల సందీప్, జడయాదగిరి, జడ నరేష్, అశోక్ రెడ్డి, అరవిందరెడ్డి, కొండ శ్రీను తదితరులున్నారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.