భాస్కర్ రావు సతీమణి జయ ప్రచారం
రథ సారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారికి అండగా నిలిచి, గెలిపించాలని ఆయన సతీమణి నల్లమోతు జయ గారు కోరారు.శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోనీ శరణ్య గ్రీన్ హోమ్స్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి ఓటర్లను అభ్యర్థించారు.మహిళా సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.అర్పులైన పేద మహిళలకు రూ.3 వేల జీవన భృతి కల్పించి ఆదుకునేందుకు సౌభాగ్యలక్ష్మి పథకం తీసుక రావడం జరిగిందన్నారు.అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి, రూ. 4 వందలకే ఇవ్వనుందని తెలిపారు.ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారుగుర్తుకు ఓటేసి, నల్లమోతు భాస్కర్ రావు గారిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు.