భాస్కర్ రావుకు భారీ స్వాగతం..


రథసారథి,వేములపల్లి:
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పల్లెల్లో ఎంతో పురోభివృద్ధి సాధించామని మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారు అన్నారు.
శుక్రవారం వేములపల్లి మండలంలోని మొల్కపట్నం, సల్కునూరు, మంగాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ ప్రగతి యాత్ర జరిగింది.ఇక్కడ భాస్కర్ రావు కు ప్రజలు భారీ స్వాగతం పలికారు.ఆయా గ్రామాల మహిళలు, యువతీయువకులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, వీధుల్లో బారులు తీరారు. పలువురు పూలమాలలు వేసి, ఎమ్మెల్యేను అభినందించారు. వివిధ గ్రామాల్లో దేవాలయాలు, బొడ్రాయి వద్ద ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు మాట్లాడుతూ గత పదేళ్ళగా కష్టపడి గ్రామాలను ఎంత గానో అభివృద్ధి చేసానన్నారు. ఇదే అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు తనకు అండగా నిలిచి మరోసారి ఆశీర్వదించాలని కోరారు.బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి, తనను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్యా, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ ఎంపిపి నామిరెడ్డి రవీనా,సర్పంచులు, ఉప సర్పంచులు,వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.