ఘనంగా నాగుల చవితి పర్వదినం

 

రథ సారథి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం తాళ్లగడ్డలో నాగల చవితి పర్వదినం ఘనంగా నిర్వహించడం జరిగింది. తెల్లవారుజాము రెండు గంటల నుండి భక్తజన కోటి నాగదేవతమూర్తికి ఈ ఇష్టమైన పాలు ,గుడ్లు, పసుపు, కుంకుమ పూజా సామాగ్రి తో పూజలు చేసుకున్న మహిళలు సుమారు 20వేల మంది భక్తజన కోటి రావడం జరిగింది. వారికి అన్ని రకాలుగా అన్ని సేవలు పూజా సామాగ్రి విషయంలో కానీ పూజ విషయంలో కానీ దర్శనం విషయంలో కానీ అన్ని రకాలుగా సేవలు అందించ డం జరిగింది.అంతే కాకుండా తీర్థ ప్రసాద వితరణ ప్రసాదం, పులిహోర ,చక్ర పొంగలి సమర్పించి మహిళా మణులు అందరి మన్ననలు పొందడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి దాతలుగా వచ్చిన వారికి గుడి నిర్మాణ దాతలకు, మరియు ప్రసాద దాతలకు ఉచిత ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించడం వారికి అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది .ఇట్టి కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి కోల సైదులు, ముదిరాజ్ అధ్యక్షులు కొంపెల్లి యాదగిరి, కోశాధికారి బంటు శ్రీనివాస్ ముదిరాజ్, భసాని గిరి మరియు సింగు రాంబాబు, బంటు శ్రీకాంత్, సింగ్ సైదులు, కొక్కు వీరన్న ,శంకర్ నాయక్, బంటు లింగయ్య ముదిరాజు, గుణగంటి శ్రీనివాస్ గౌడ్ ప్రసాద దాతలు ఆర్ ఎస్ వి రైస్ ఇండస్ట్రీస్ ,ఇనుగుర్తి మోహన్ రావు సూర్య రైస్ ఇండస్ట్రీస్ కనిగిరి సత్యనారాయణ దశానియా లాలాజీసింగ్ సొల్లేటి నరసింహ చారి మొదలగువారు సహకరించడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.