ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునిగా పనిచేయాలి: బీఎల్ఆర్

మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి లక్ష మెజార్టీ ఖాయం

రథసారథి, మిర్యాలగూడ: 

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక పేరుతో ఎస్పీ కన్వెన్షన్ హాల్లో దాదాపు 5వేల మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, గత నాలుగైదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే భాస్కరరావు ఎన్ని ప్రలోభాల కు గురిచేసిన ఎన్ని బాధలు పెట్టిన తట్టుకొని ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీ మారలేదని ఆయన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని, మేము సీనియర్లను ఎప్పుడు గౌరవిస్తామని తెలిపారు. అలాగని ఎవరు తప్పు చేసిన ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంసిద్ధుడై ఉన్నాడని బిఎల్ఆర్ తెలిపారు. సోనియమ్మ మనకు ఇచ్చిన తెలంగాణని అప్పుల తెలంగాణ గా మార్చిన కేసీఆర్ మాయమాటలను మన నియోజకవర్గంలో గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఉందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గడపగడపకు అందిస్తూ సోనియమ్మ మనకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూ చించారు. అదేవిధంగా సోనియమ్మ మనకు తెలంగాణనిచ్చి 9 వ సంవత్సరంలో నుండి 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి గడపకు ఆమె గుర్తుగా సోనియమ్మ కానుకగా ఒక గోడ గడియారాన్ని అందించవలసిన బాధ్యత మనమందరము భుజాన వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.మొదటగా దామరచర్ల, అడవి దేవులపల్లి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని ఒక 15 నుండి 20 రోజులలోపు మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం కూడా ఈ సోనియమ్మ కానుకను నియోజకవర్గంలోని గడపగడపకు అందిస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, వేములపల్లి ఎంపీపీ సునీత కృపయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వార్డ్ ఇన్చార్జిలు మహిళా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.