నాటక పోటీలకు స్థల పరిశీలన

రథ సారథి,మిర్యాలగూడ:

వచ్చే మార్చి నెలలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలకు గాను స్థల ఎంపిక కోసం మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వారు ఈరోజు భవనాల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ళ రామచంద్రరావు ,ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి, కోశాధికారి పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మలు స్థానిక ఎన్ఎస్పి క్యాంపు లోని మినీ ఆడిటోరియం పక్కన ఉన్న నూతన భవనాలను పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తికానందున ఎమ్మెల్యే గారి సహకారంతో ఆడిటోరియం పక్కనే ఉన్న పలు నూతన భవనాలలో ఈ నాటక పోటీల నిర్వహణ కోసం తగిన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ పరిశీలన చేపట్టామన్నారు. నాటక పోటీలకు తగిన భవనం ఎంపిక త్వరలోనే చేపడతామన్నారు.

Leave A Reply

Your email address will not be published.